'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు
- మార్చి 1వ తేదీన ఓటీటీలోకీ 'సంక్రాంతికి వస్తున్నాం'
- జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే రోజే ఓటీటీలోకి వస్తోన్న చిత్రం
- ఓటీటీలో కొన్ని కామెడీ సన్నివేశాలను జతపరిచే అవకాశం
మార్చి 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానల్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ తాజాగా తన యాప్‌లో విడుదల చేసిన ప్రత్యేక ప్రోమో ద్వారా తెలియజేసింది.
'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా నిడివిని దృష్టిలో ఉంచుకొని తొలగించిన కొన్ని హాస్య సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో జత చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.