ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్న పవన్ కల్యాణ్... కారణం ఇదే!
- ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు
- పవన్ గ్రాడ్యుయేట్ కాకపోవడంతో ఓటు వేయలేని వైనం
- ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, లోకేశ్
ఈ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓటు వేయలేకపోయారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం పట్టభద్రులు మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ గ్రాడ్యుయేట్ కాదన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. మరోవైపు, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ పవన్ ఓ వీడియోను విడుదల చేశారు.