ఒంగోలులో వైసీపీకి భారీ షాక్.. జనసేనలో చేరుతున్న 20 మంది వైసీపీ కార్పొరేటర్లు
- అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు
- బాలినేని నేతృత్వంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్న కార్పొరేటర్లు
- ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ చేరిక కార్యక్రమం
వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ... పవన్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో వీరంతా ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా గెలిచారు. బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరడంతో... వీరంతా కూడా ఆయన వెంటే నడుస్తామని చెప్పి, జనసేనలో చేరుతున్నారు. ఈ 23 మంది సభ్యులు కూడా జనసేనలో చేరితే మొత్తం ఒంగోలు రాజకీయమే మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.