తిరుమలలో వివిధ సేవల కోసం నేటి నుంచి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు
- మే నెల అర్జితసేవా టికెట్ల కోటా నేడు విడుదల
- వర్చువల్ సేవలు, అంగ ప్రదక్షిణం, శ్రీవాణి టికెట్ల విడుదల తేదీల ప్రకటింపు
- వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు ఫిబ్రవరి 22న విడుదల
- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా ఫిబ్రవరి 24న విడుదల
**వర్చువల్ సేవా టికెట్లు**
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు కోటాను ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
**అర్జిత సేవా టోకెన్లు**
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టోకెన్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
**అంగ ప్రదక్షిణం టోకెన్లు**
అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించి మే నెల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
**శ్రీవాణి ట్రస్టు టికెట్లు**
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
**వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు**
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం మే నెల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
**ప్రత్యేక దర్శన టికెట్లు**
మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
**తిరుమల, తిరుపతి గదుల కోటా**
తిరుమల మరియు తిరుపతిలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.