రాహుల్ గాంధీ కులం, మతం గురించి బీజేపీ ప్రశ్న... మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం
- కులగణనను తప్పుపట్టిన బీజేపీ నేతలు
- నరేంద్ర మోదీ కులంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీ కులం, మతమేమిటో చెప్పాలని బీజేపీ నేతల నిలదీత
- రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని శ్రీధర్ బాబు ఆగ్రహం
బీసీ వర్గాలను బీజేపీ మోసం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన అంశాన్ని వారు తప్పుపడుతూ, తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టకుండా బీసీలకు బీజేపీ అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. హిందువుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.
కాగా, కులగణనను బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులమేమిటో చెప్పాలని నిలదీశారు. దీంతో శ్రీధర్ బాబు పైవిధంగా స్పందించారు.