మస్తాన్ సాయి వివాదంలో కీలక పరిణామం.. ఏపీ గవర్నర్ కు లావణ్య లేఖ
- ఏపీ గవర్నర్ కు లావణ్య తరపు లాయర్ లేఖ
- మస్తాన్ సాయి వల్ల మస్తాన్ దర్గాకు అపవిత్రత కలుగుతోందన్న లాయర్
- దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబ సభ్యులను తొలగించాలని విన్నపం
సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్యల మధ్య నెలకొన్న వివాదం సినీ పరిశ్రమలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే మస్తాన్ సాయిపై మహిళల న్యూడ్ ఫొటోలు తీయడం, అత్యాచారం, డ్రగ్స్ ఇలా పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మస్తాన్ సాయి హైదరాబాద్ నార్సింగి పోలీసుల కస్టడీలో ఉన్నాడు.