ఇలాగేనా ప్రవర్తించేది?.. చింతమనేనికి చంద్రబాబు అక్షింతలు
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లిన చింతమనేని కారుకు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉండటం వివాదానికి దారితీసింది. ఈ గొడవ గురించి చంద్రబాబుకు వివరించేందుకు చింతమనేని నిన్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని ఆయన చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలా స్పందించారు.