Valentines Day Special: దివ్వెల.. దువ్వాడ.. ప్రేమ ఊసులు.. వాలంటైన్స్ డే స్పెషల్ వీడియో!

లేటు వయసులో ఘాటు ప్రేమతో తరచు వార్తల్లో నిలుస్తున్నారు దివ్వెల మాధురి, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఇక వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంట చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. యువ ప్రేమికుల మాదిరిగా వాలంటైన్ వీక్ పాటిస్తూ వారు చేతిలో చెయ్యేసి చెప్పుకున్న ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు, ఇచ్చుకున్న కానుకలు వీడియోలో చూడొచ్చు. ఇద్దరూ ఒకరికి ఒకరు లవ్ ప్రపోజ్ చేసుకోవడం కూడా వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక, మీరూ ఈ ప్రేమజంట వీడియోపై ఓ లుక్కేయండి.