ఆ గొప్ప మల్లయోధుడితో రామ్‌చరణ్ సినిమాకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?
- కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలంలో జరిగే కథగా రామ్‌చరణ్ చిత్రం
- మల్లయోధుడుగా కనిపించనున్న రామ్‌చరణ్
- ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న యాక్షన్ ఏపిసోడ్స్
ఇప్పటి వరకు దాదాపుగా 25 రోజుల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి దసరాకు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు. ఇందుకోసం దర్శకుడు పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ రూటెడ్ కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ మల్లయోధుడుగా కనిపిస్తారని తెలిసింది.
ఇక, మనందరికి తెలిసిన తెలుగునేలకు చెందిన గొప్ప మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడుకు, ఈ సినిమా కథకు సంబంధం ఉందని సమాచారం. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కూడా కోడి రామ్మూర్తి నాయుడు ప్రేరణతో, ఆయన పుట్టిన ఊరు శ్రీకాకుళంలోని వీరఘట్టంలోనే పుట్టి ఆయన అడుగుజాడల్లోనే మల్లయోధుడుగా శిక్షణ పొంది, కుస్తీల పోటీలో భారతదేశం తరపున పాల్గొంటాడని తెలిసింది. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఫైట్‌మాస్టర్‌తో రూపొందిస్తున్నారట. 'పెద్ది' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి దాదాపుగా ఇదే టైటిల్‌ను ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ చిత్రం రామ్‌చరణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా ఉంటుందని, ఇందుకోసం సినిమా బృందం అంతా ఎంతో కృషి చేస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.