ఓటీటీలోకి వచ్చేసిన పుష్ప-2.. రీలోడెడ్ వెర్షన్‌కు మరిన్ని సీన్లు.. అమాంతం పెరిగిన నిడివి!
- డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 సినిమా
- విడుదలైనప్పుడు మూవీ నిడివి 3.20 గంటలు మాత్రమే
- సంక్రాంతి తర్వాత 20 నిమిషాల సీన్లు జత చేసిన మేకర్స్
- ఇప్పుడు మరిన్ని సీన్లు జత చేసిన వైనం
గత అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న పుష్ప-2 అభిమానులకు మరింత సర్‌ప్రైజ్ ఇచ్చింది. రీలోడెడ్ వెర్షన్ నిడివిని మరింత పెంచింది. సంక్రాంతి తర్వాత థియేటర్‌లో విడుదల చేసిన రీలోడెడ్ వెర్షన్‌కు మరిన్ని సన్నివేశాలను ఇందులో జత చేశారు. దీంతో ఇప్పుడీ సినిమా నిడివి ఏకంగా 3.44 గంటలకు పెరిగింది.
మూవీని డిసెంబర్ 5న విడుదల చేసినప్పుడు దాని నిడివి 3 గంటల 20 నిమిషాలు మాత్రమే. సంక్రాంతి తర్వాత మరో 20 నిమిషాలు కలపడంతో నిడివి 3.40 గంటలకు చేరుకుంది. ఇప్పుడు మరో 4 నిమిషాలు కలిపి ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పుష్ప-2 స్ట్రీమింగ్ కానుంది.