'గాంధీ తాత చెట్టు' సినిమాపై మహేశ్ బాబు రివ్యూ
- సుకుమార్ తనయ సుకృతివేణి ప్రధాన పాత్రలో గాంధీ తాత చెట్టు
- పద్మావతి మల్లాది దర్శకత్వం
- రేపు (జనవరి 24) విడుదల
- నేడు మీడియా కోసం ప్రివ్యూ
కాగా, ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. గాంధీ తాత చెట్టు... ఈ చిత్రం మనతో ఉండిపోతుంది. అహింస గురించి ఎంతో పదునైన కథాంశంతో ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ అందమైన కథకు దర్శకురాలు పద్మావతి మల్లాది జీవం పోశారు. ఇక, నా చిన్ని నేస్తం సుకృతివేణి... నీ నటన పట్ల అమితంగా గర్విస్తున్నాను. నువ్వు ఇంత ప్రతిభావంతమైన నటిగా ఎదగడం, శక్తిమంతమైన నటను ప్రదర్శించడం చూస్తుంటే హృదయం ఆనందంతో నిండిపోతోంది. వెళ్లండి... ఈ చిన్ని కళాఖండాన్ని చూడండి" అని మహేశ్ బాబు పిలుపునిచ్చారు.