శివాజీ కాలం నాటి నిధి రహస్యం .. 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్' సిరీస్!
- హాట్ స్టార్ కి 'ది సీక్రెట్ ఆఫ్ ది శీలేదార్స్'
- నిధి కోసం సాగే అడ్వెంచర్ థ్రిల్లర్
- ఆసక్తిని రేకెత్తించిన ట్రైలర్
- ఈ నెల 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఇది అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. మరాఠాలోని ఒక నవల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. సాయి తంహనకర్, రాజీవ్ ఖండేపాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 31వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
శివాజీ మహారాజ్ కాలంలో భద్రపరచబడిన ఒక నిధి రహస్యం శీలేదార్స్ కి తెలుస్తుంది. ఆ నిధిని కాపాడవలసిన బాధ్యత తమపైనే ఉందనే విషయం వారికి ఆలస్యంగా అర్థమవుతుంది. దాంతో ఆ నిధి ఎక్కడ ఉందనేది తెలుసుకుని, దానిని సంరక్షించడానికి రంగంలోకి దిగుతారు. అయితే ఈ నిధిని కాజేయడానికి ఒక బ్యాచ్ ప్లాన్ చేస్తుంది. ఆ నిధి విషయంలో ఎవరికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ.