రూ. 100 కోట్ల క్లబ్‌లోకి 'డాకు మహారాజ్'... అధికారికంగా ప్రకటించిన మేకర్స్
- బాలకృష్ణ, బాబీ కాంబోలో 'డాకు మహారాజ్'
- ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మూవీ
- నాలుగు రోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ.105 కోట్ల కలెక్షన్స్
- రేపటి నుంచి తమిళంలోనూ 'డాకు మహారాజ్'
'కింగ్ ఆఫ్ సంక్రాంతి' అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అలాగే ఈ మూవీని రేపు తమిళంలోనూ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక 'డాకు మహారాజ్'కు మొదటి రోజైన ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ బాణీలు అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు.