సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్‌టీఆర్
- సైఫ్ ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన దుండగుడు
- ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలు
- లీలావతీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు
- ఈ దాడి తనను షాక్‌కు గురి చేసిందన్న తారక్
అటు దేవర టీమ్ కూడా ఈ ఘటనపై స్పందించింది. "ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్" అని పేర్కొంది.
కాగా, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆయనపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావతీ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. కాగా, సైఫ్‌కు అయిన గాయాల్లో రెండు మరీ లోతుగా ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బాలీవుడ్ వర్గాలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది.