'డాకు మహారాజ్'... 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..!
- బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో 'డాకు మహారాజ్'
- ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజైన మూవీ
- మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లకు పైగా వసూళ్లు
- ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ
"ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'డాకు మహారాజ్' వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సంక్రాంతికి రాజు డాకు మహారాజు. ఈ మహారాజు బాక్సాఫీస్, హృదయాలను ఒకేలా శాసిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో నిండిన పరిపూర్ణమైన సంక్రాంతి ట్రీట్!" అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
కాగా, ఈ చిత్రానికి మొదటి రోజు రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రాగా... రెండో రోజు ఈ కలెక్షన్స్ రూ. 74కోట్లు దాటాయి. మూడో రోజు రూ. రూ.92కోట్లు క్రాస్ కావడం విశేషం. అలాగే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగానూ 'డాకు మహారాజ్' నిలిచింది.
కాగా, ఈ మూవీలో బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.