పాడి కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు
- లిఖితపూర్వకంగా స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంజయ్
- ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారన్న సంజయ్
- నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటామన్న స్పీకర్
స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్... నివేదిక తెప్పించాక చర్యలు తీసుకుంటామన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం రసాభాసగా మారింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.