నేటి నుంచి ఓటీటీలో అల్లరి నరేశ్ 'బచ్చల మల్లి'
చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైన బచ్చల మల్లికి తండ్రి అంటే ఎంతో ఇష్టం. అయితే, తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంతో బచ్చల మల్లి చిన్న వయసులోనే చెడు దారి పడతాడు. కాలేజీ చదువుకు ఫుల్స్టాప్ పెట్టి ట్రాక్టర్ నడుపుతుంటాడు. గొడవల్లో దూరుతుంటాడు. ఈ క్రమంలో అతడి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీ కథ.