తిరుపతి విషాదం నేపథ్యంలో ‘డాకు మహరాజ్’ ప్రీ రిలీజ్ వేడుక రద్దు
- నేడు అనంతపురంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- పవిత్ర స్థలంలో భక్తుల ప్రాణాలు పోవడం హృదయవిదారకమని చిత్ర నిర్మాణ సంస్థ వ్యాఖ్య
- సంక్రాంతి కానుకగా ఈ నెల 12న డాకు మహరాజ్ విడుదల
పవిత్ర స్థలంలో తొక్కిసలాట జరగడం, ఆరుగురు భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ విషాద సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నట్లు పేర్కొంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
కాగా, సంక్రాంతి కానుకగా ఈ నెల 12న డాకు మహరాజ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అయితే, తిరుపతిలో భక్తులు చనిపోయిన నేపథ్యంలో ఈవెంట్ ను రద్దు చేసింది.