బన్నీ ఫ్యాన్స్ కు పండగే... పుష్ప-2 చిత్రానికి మరో 20 నిమిషాల ఫుటేజి యాడ్ చేస్తున్న మేకర్స్
- డిసెంబరు 5న రిలీజైన పుష్ప-2
- తాజాగా చిత్రం నిడివి పెంచిన మేకర్స్
- ఆ 20 నిమిషాల ఫుటేజి అదిరిపోతుందని వెల్లడి
- ఇప్పటికే భారతీయ సినీ రికార్డులు బద్దలు కొట్టిన పుష్ప-2
- రీలోడెడ్ వెర్షన్ తో ఎక్స్ ట్రా ఫైరీగా మారుతుందని ధీమా
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో డిసెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయం నమోదు చేసింది. భారతీయ సినీ రికార్డులను తిరగరాస్తూ మరో చరిత్రను సృష్టించింది.
కేవలం 32 రోజుల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా, ఇండియన్ నెంబర్‌వన్ ఫిల్మ్‌గా 'పుష్ప-2' ది రూల్ నిలిచింది. ఈ క్రమంలో 'బాహుబలి-2' వసూళ్లను పుష్ప-2 అధిగమించింది. ఈ చిత్రం కేవలం 32 రోజుల్లో రూ.1,831 కోట్లు వసూలు చేసి ఇండియా చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు సృష్ఠించింది.
ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధించి రికార్డులు సాధించడంలో కూడా ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం యావత్ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తోంది. రష్మిక మందన్నా నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది.