ఆ పాత్ర నేను చేయవలసింది: మలయాళ స్టార్ అసిఫ్ అలీ!
- మలయాళంలో రూపొందిన 'మంజుమ్మేల్ బాయ్స్'
- రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా
- సుభాష్ పాత్ర కోసం తనని అడిగారన్న అసిఫ్ అలీ
- అందుకే ఆ సినిమా చేయలేకపోయానని వెల్లడి
- ఆ పాత్రను క్రేజ్ లేని ఆర్టిస్ట్ చేయడమే కరెక్ట్ అంటున్న ప్రేక్షకులు
అలాంటి అసిఫ్ అలీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'మంజుమ్మేల్ బాయ్స్' సినిమాలో తాను చేయవలసి ఉందని చెప్పాడు. ఈ సినిమాలో 'సుభాష్' అనే పాత్ర సొరంగ మార్గంలా కనిపించే ఒక అగాధంలోకి జారిపోతుంది. ఆ పాత్రను బయటికి తీసుకు రావడానికి మిగతా స్నేహితులంతా నానా తంటాలు పడతారు. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించిన ఈ సినిమా, 240 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.
ఈ సినిమాలో సుభాష్ పాత్ర కోసం దర్శక నిర్మాతలు ముందుగా అసిఫ్ అలీని అనుకున్నారట. అయితే ఆ సమయంలో తన డేట్స్ లేకపోవడం వలన చేయలేకపోయానని అసిఫ్ అలీ అన్నాడు. అసిఫ్ అలీకి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయన గుహలో పడిపోతే, ఆ పాత్ర తప్పకుండా బ్రతుకుతుందని ఆడియన్స్ గెస్ చేసేవారు. అందువలన ఆ పాత్రను వేరొకరితో చేయించడమే మంచిదైందనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్.
మలయాళంలో రూపొందిన