నన్ను నిలబెట్టినవి ఆ రెండు సినిమాలే: తనికెళ్ల భరణి!
- రచయితగా 'లేడీస్ టైలర్' పేరు తెచ్చిందన్న భరణి
- 'శివ' సినిమా నటుడిగా గుర్తింపు తెచ్చిందని వెల్లడి
- 'యమలీల'తో నటుడిగా బిజీ అయ్యానని వివరణ
- ఒకేసారి 26 సినిమాలకు సైన్ చేశానన్న భరణి
"ఆ తరువాత చెన్నై వెళ్లినప్పుడు దర్శకుడు వంశీ గారికి నన్ను రాళ్లపల్లిగారు పరిచయం చేశారు. కామెడీ రాయాలని చెబుతూ, వంశీగారు నాకు ఏడు సీన్లు ఇచ్చారు. ఆ సాయంత్రానికే రాసుకుని తీసుకుని వెళితే వంశీ ఆశ్చర్యపోయాడు. నేను రాసిన సీన్లు చదివిన తరువాత, ఆయన అదే పనిగా నవ్వాడు. 'నాకు కావలసిన రైటర్ దొరికేశాడు... నెక్స్ట్ సినిమా మీరే రాస్తున్నారు' అని అన్నాడు. ఆ సినిమానే 'లేడీస్ టైలర్'.
"ఆ సినిమా తరువాత ఒక రచయితగా నేను వెనుదిరిగి చూసుకోలేదు. 'కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్... చెట్టుకింద ప్లీడర్... ఇలా ఓ అరడజను సినిమాల వరకూ నేనే రాశాను. 'లేడీస్ టైలర్' నా కెరియర్ కి ఎంతో ఉపయోగపడిన సినిమా. రచయితగా నాకు ఒక స్థాయిని తెచ్చిపెట్టిన సినిమా అది. ఆ తరువాత నటుడిగా కూడా వేషాలు వేస్తూ వెళ్లాను. నటుడిగా 'శివ' సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 'యమలీల'తో నటుడిగా బిజీ అయ్యాను. ఆ సినిమా తరువాత నటుడిగా 26 సినిమాలకి సైన్ చేశాను" అని చెప్పారు.