బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనేవి చిన్న విషయాలు: దిల్ రాజు
- తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల కీలక సమావేశం
- సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు
- సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యం అని వెల్లడి
హైదరాబాదులో అన్ని భాషల చిత్రాల షూటింగులు జరగాలని, హాలీవుడ్ సినిమా షూటింగుల స్థాయిలో నగరంలో వసతులు ఉండాలని సీఎం కోరుతున్నారని దిల్ రాజు వెల్లడించారు. సినీ పరిశ్రమకు హైదరాబాదు నగరం హబ్ గా తయారు కావాలన్నారని వివరించారు. సినీ పరిశ్రమ పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని సూచించారని తెలిపారు.
డ్రగ్స్ కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని దిల్ రాజు పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమకు అందించాల్సిన భద్రతపై ముఖ్యమంత్రి రాష్ట్ర డీజీపీతో చర్చించారని వెల్లడించారు. ముఖ్యమంత్రితో మరోసారి సమావేశం అవుతామని తెలిపారు.