జపాన్ లో ప్రేమికుల దినోత్సవంలా క్రిస్మస్
- పండుగలా కాకుండా రొమాంటిక్ డేట్ గా జరుపుకుంటున్న జంటలు
- దేశ జనాభాలో క్రైస్తవుల సంఖ్య ఒక్క శాతం కంటే తక్కువే
- ప్రత్యేక ఆఫర్లతో ఆకర్షిస్తున్న రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్
చల్లటి వాతావరణం, క్రిస్మస్ లైట్ల వెలుగులు తమకు అలాంటి ఫీలింగ్ కలగజేస్తున్నాయని చెబుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, భాగస్వామితో సన్నిహితంగా మెలిగేందుకు ఈ సెలవును ఉపయోగించుకుంటున్నట్లు వివరించారు. దీనిని అక్కడి రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ అడ్వాంటేజీగా తీసుకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం కూడా కారణమేనని అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రత్యేక ఆఫర్లతో జనాలను ఆకర్షిస్తున్నాయి. దీంతో భాగస్వామితో సరదాగా షాపింగ్ చేస్తూ, రెస్టారెంట్ లో డిన్నర్ కు వెళుతూ యువ జంటలు సెకండ్ హనీమూన్ లాగా ఫీలవుతున్నారట.