ఈ జింకల తెలివి చూశారా? నోరెళ్లబెట్టే వైరల్ వీడియోలు ఇవిగో!
- వాహనాలు ఆగిపోయే దాకా వేచి ఉండి రోడ్డు దాటిన ఒక జింక
- సూపర్ మార్కెట్ తలుపు దగ్గరికి వెళ్లి... ఆహారం పెట్టాలంటూ మర్యాద పూర్వక సంకేతాలు చేసిన మరో జింక
- వేటగాడి వద్దకే వచ్చి మనసు కరిగించిన ఇంకో జింక
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు
ఒక వీడియోలో జింక రోడ్డు దాటేందుకు ట్రాఫిక్ ఆగిపోయే వరకు వేచి ఉండి... ఆ తర్వాతే మెల్లగా రోడ్డు దాటింది.
మరో వీడియోలో జింక ఓ వేటగాడి దగ్గరికి వచ్చి నిల్చుంది. అమాయకంగా అది చూసిన చూపులకు కరిగిపోయిన వేటగాడు... దాన్ని నిమిరి వదిలేశాడు. ఆ తర్వాత చెంగుమని దూకుతూ వెళ్లిపోయింది.
ఇంకో వీడియోలో జింకలు ఒక సూపర్ మార్కెట్ వద్దకు వెళ్లి తలుపు ముందు నించున్నాయి. తమకు ఆహారం ఇవ్వాలన్నట్టుగా సంకేతం ఇస్తూ, జపాన్ వారు కాస్త ముందుకు వంగి పలకరించుకునేలా తల వంచుతూ నిలబడ్డాయి.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఆ జింకలు మనుషులకన్నా బెటర్ కదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది వాటి తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆ వైరల్ వీడియోలను ఈ కింద చూడండి