పుష్ప-2 టీమ్ కు కంగ్రాట్స్ చెప్పిన యశ్ రాజ్ ఫిలింస్
- డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2
- రికార్డులు తిరగరాస్తూ, కొత్త చరిత్ర సృష్టించిన చిత్రం
- బాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డులు కూడా బద్దలు
ఈ నేపథ్యంలో, బాలీవుడ్ లో సుప్రసిద్ధ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ ఓ ప్రకటన చేసింది. పుష్ప-2 టీమ్ మొత్తానికి శుభాభినందనలు తెలిపింది.
"రికార్డులున్నది బద్దలవడానికే. పాత రికార్డులు పోతుంటాయి... కొత్త రికార్డులు వస్తుంటాయి. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడుతుంటాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్నందుకు యావత్ పుష్ప-2 చిత్రబృందానికి కంగ్రాచ్యులేషన్స్. ఫైర్ నహీ... వైల్డ్ ఫైర్ (మామూలు ఫైరు కాదు... వైల్డ్ ఫైరు)" అంటూ యశ్ రాజ్ ఫిలింస్ తన ప్రకటనలో పేర్కొంది.