చిరంజీవితో కలిసి నటించిన సినిమాపై మోహన్ బాబు స్పందన
- 'పట్నం వచ్చిన పతివ్రతలు' తాను మర్చిపోలేని సినిమాల్లో ఒకటన్న మోహన్ బాబు
- సినిమాలో తన పాత్ర ఎంతో తృప్తిని కలిగించిందని వ్యాఖ్య
- చిరంజీవితో కలిసి నటించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందన్న మోహన్ బాబు
తన సినీ ప్రయాణంలో 1982లో వచ్చిన 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుందని మోహన్ బాబు పేర్కొన్నారు. ఎంతో ప్రతిభావంతుడైన మౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో తృప్తిని కలిగించిందని అన్నారు. ముఖ్యంగా తన ప్రియ మిత్రుడు చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం, ఆయనకు సోదరుడిగా నటించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందని చెప్పారు. తాను మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా ఇది నిలిచి పోతుందని తెలిపారు.
ఈ సినిమాలో రాధిక, గీత హీరోయిన్లుగా నటించారు.