ఈ నెల 21న డాలస్ లో కలుసుకుందాం: రామ్ చరణ్
- రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్
- జనవరి 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్
- ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్
- డిసెంబరు 21న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్
విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో గేమ్ చేంజర్ చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ నెల 21న అమెరికాలోని డాలస్ నగరంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఓ భారతీయ చిత్రం అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుండడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ నేపథ్యంలో, అభిమానుల కోసం రామ్ చరణ్ ఓ వీడియో సందేశం పంచుకున్నారు.
"నమస్తే డాలస్... మీ అందరినీ కలుసుకునేందుకు నేను సూపర్ ఎగ్జయిటింగ్ గా ఉన్నాను. డాలస్ లో మా చిత్రం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజేశ్ కల్లేపల్లి గారు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న కర్టిస్ కల్వెల్ సెంటర్ లో మాతో జాయిన్ అవ్వండి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఉత్సాహంగా ఉంది... సీ యూ గైస్... లవ్యూ" అంటూ రామ్ చరణ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.