పోక్సో కేసులో వైసీపీ నేత చెవిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
- బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేసిన ఆరోపణలపై చెవిరెడ్డిపై కేసు
- విచారణను 24కు వాయిదా వేసిన హైకోర్టు
- అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని స్పష్టీకరణ
ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచాణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.