'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రిలీజ్
- మంచు విష్ణు కథానాయకుడిగా ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప
- ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం
- 'కిరాట' అనే పవర్‌ఫుల్ పాత్రలో మోహన్ లాల్ కనిపించబోతున్నట్టు మేకర్స్ ప్రకటన
- తాజాగా 'కిరాట' ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
ఇక మైథలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణం నటిస్తుండడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు ఇతర కీలక తారాగణం ఫస్ట్ లుక్‌లను మేకర్స్ విడుదల చేశారు.
ఇప్పుడు మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ మూవీలో ఆయన 'కిరాట' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో చూడటానికి ఆయన చాలా గంభీరంగా కనిపిస్తున్నారు.