Allu Arjun: అల్లు అర్జున్ నివాసానికి దేవరకొండ బ్రదర్స్.. వీడియో ఇదిగో!
--
జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసానికి హీరో విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి వెళ్లారు. అల్లు అరవింద్ కు విష్ చేయగా.. విజయ్ ను అల్లు అరవింద్ అప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడుతున్న అల్లు అర్జున్ కాల్ ముగించి విజయ్ తో కరచాలనం చేసి హత్తుకున్నారు. విజయ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదే సమయంలో డైరెక్టర్ సుకుమార్ కూడా అల్లు అర్జున్ ను కలిసేందుకు వచ్చారు. వీరితో పాటు వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్, రవి, దిల్‌రాజు తదితరులు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వీరందరూ తాజా పరిణామాల గురించి చర్చించారు.