hero siddharth: పుష్ప-2 పాట్నా ఈవెంట్ పై నోరుపారేసుకున్న హీరో సిద్ధార్థ్!

hero siddharth overaction on pushpa 2 patna event

  • పుష్ప -2 పాట్నా ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • సిద్ధార్థ్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్
  • ఈ నెల 13న సిద్ధార్థ సినిమా 'మిస్ యు' రిలీజ్

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప -2 కలెక్షన్లలో సునామీ సృష్టించి బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆ మధ్య బీహార్‌లోని పాట్నాలో భారీ ఎత్తున నిర్వహించగా, ఈ ఈవెంట్‌కు దాదాపు 3 లక్షల మందికి పైగా విచ్చేయడం హాట్ టాపిక్‌గా నిలిచింది. 
 
అయితే, పాట్నాలో జరిగిన ఈ ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నోరు పారేసుకున్నారు. ఆయన నటించిన 'మిస్ యు' సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. బీహార్‌లోని పాట్నాలో పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రేక్షకులు కేవలం మార్కెటింగ్ మాత్రమే. అది పెద్ద విషయం కాదన్నారు. రోడ్డుపై జేసీపీ వర్క్ చేస్తున్నా కూడా ఎక్కువ మంది గుమికూడతారన్నారు. 

బీహార్ లాంటి చోట అంత క్రౌడ్ రావడం మ్యాటర్ కాదని అన్నాడు. పెద్ద మైదానాన్ని బ్లాక్ చేసి ఈవెంట్‌ను నిర్వహిస్తే ప్రజలు గుమికూడతారని అన్నాడు. ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ ఇస్తే రాజకీయ నాయకుల మీటింగ్‌కు జనాలు విపరీతంగా వస్తారని, అలా అని రాజకీయ పార్టీలు గెలుస్తాయా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బన్నీ అభిమానులు సిద్ధార్థ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇలా నోటి దురుసు వ్యాఖ్యల వల్లే ఒకప్పుడు టాప్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ సినిమాలు ఇప్పుడు చూసే వారు లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News