మోహన్ బాబు అయితేనేం, ఇంకెవరైతేనేం... మీడియాపై దాడి చేయడమేంటి?: కేఏ పాల్
- తన ఇంట్లో ప్రవేశించిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి
- తీవ్రంగా ఖండించిన కేఏ పాల్
- మీడియా ప్రతినిధులపై దాడి ఘోరం అంటూ వ్యాఖ్యలు
మోహన్ బాబు అయితేనేం, ఇంకెవరైతేనేం... మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్దవాళ్లయినా సరే మీడియాపై దాడి చేయడం అన్నది ఘోరం అని పేర్కొన్నారు.
మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి దిగడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.