ముగ్గురు భామల్లో ముందున్న రష్మిక!
- వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక
- 'పుష్ప 2'తో మరోసారి దక్కిన పాన్ ఇండియా హిట్
- టాలీవుడ్ లో తన పొజీషన్ కాపాడుకున్న రష్మిక
- దగ్గరలో కనిపించని పూజ హెగ్డే - కీర్తి సురేష్ సినిమాలు
పూజా హెగ్డేకి 'అల వైకుంఠపురంలో' తరువాత హిట్ పడలేదు. ఆ తరువాత ఆమె చేసిన పాన్ ఇండియా సినిమాలు వరుసగా నిరాశ పరుస్తూ వెళ్లాయి. ఆ సినిమాలు హిట్ అయితే ఆమె పరిస్థితి వేరేలా ఉండేది... కానీ దురదృష్టం కొద్దీ అలా జరగలేదు. అలాగే కీర్తి సురేశ్ కి 'దసరా' తరువాత సక్సెస్ రాలేదనే చెప్పాలి. ఆమె ఎంచుకున్న కథలు... పాత్రలే అందుకు కారణం.
ఇక రష్మిక మాత్రం ఈ లోగా బాలీవుడ్ 'యానిమల్... తమిళంలో 'వరిసు'తో తన గ్రాఫ్ ను కాపాడుకుంటూ, 'పుష్ప 2'తో మరోసారి పాన్ ఇండియా హిట్ అందుకుంది. టాలీవుడ్ వరకూ చూసుకుంటే ఈ ముగ్గురు భామల్లో ముందుగా తన పొజీషన్ కి తిరిగొచ్చిన బ్యూటీగా రష్మికనే కనిపిస్తోంది మరి.