కారును దగ్ధం చేసిన మావోయిస్టులు! ఏజన్సీ ఏరియాలో కలకలం
- చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్లే జాతీయ రహదారిలో కారును దగ్ధం చేసిన మవోయిస్టులు
- మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఘటన
- ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు
ఈ నెల 2 నుంచి 8 వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరిగాయి. వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది? ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు? అనే సమాచారం తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఏజన్సీ ఏరియాలో ఆందోళన రేకెత్తిస్తోంది.