తండ్రితో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ
- కొన్ని నెలల కిందట తెలంగాణలో వరదలు
- రూ.15 లక్షల విరాళం ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ
- నేడు సీఎంను కలిసి చెక్ అందించిన వైనం
- సిద్ధును అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తాము ప్రకటించిన రూ.15 లక్షల చెక్ ను సీఎం రేవంత్ రెడ్డికి అందించాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డను అభినందించారు. సమాజం పట్ల బాధ్యతతో ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు.
సిద్ధు జొన్నలగడ్డతో పాటు సీఎంను కలిసిన వారిలో డాక్టర్ సి.రోహిణ్ రెడ్డి, మహేంద్ర, నిర్మాత కాశి కొండ కూడా ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. సిద్ధు జొన్నలగడ్డను, ఆయన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డను శాలువా కప్పి సత్కరించారు.



