వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో బిగ్ షాక్
- ద్వారంపూడి కుటుంబానికి చెందిన మరో రొయ్యల శుద్ధి పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు
- నోటీసులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి
- ఆగస్టు 6న గురజనాపల్లిలోని రొయ్యలశుద్ధి పరిశ్రమను మూసివేయించిన అధికారులు
తాజాగా, ప్రత్తిపాడు మండలం లంపకలోవ సమీపంలోని వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ పేరిట ఉన్న రెండో యూనిట్‌ను మూసివేయాలంటూ కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం జోనల్ కార్యాలయం నిన్న ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పరిశ్రమలో అతిక్రమణలు గుర్తించారు. ఆ అతిక్రమణలను సరిదిద్దుకోవాలని పీసీబీ నోటీసులు జారీ చేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఉత్పత్తి నిలిపివేయమని (క్లోజింగ్ ఆర్డర్) ఉత్తర్వులు ఇచ్చారు.