జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా?
- ప్రస్తుతం హిందీ చిత్రం 'వార్ 2' షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్
- ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవనున్న ఎన్టీఆర్
- ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం
ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు చెపుతున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలు కానున్నట్టు తెలుస్తోంది.