ఆ వీడియోపై స్పందించిన రేవంత్ రెడ్డి... రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్
- డ్రగ్స్ నియంత్రణపై అల్లు అర్జున్ వీడియో
- ఈ వీడియో చేయడంపై రేవంత్ రెడ్డి హర్షం
- డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీ చొరవకు అభినందనలంటూ ఐకాన్ స్టార్ రిప్లై
రేవంత్ రెడ్డి ట్వీట్‌కు అల్లు అర్జున్ కామెంట్ రూపంలో రిప్లై ఇచ్చారు. హైదరాబాద్‌ను, తెలంగాణను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు.
కాగా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఇటీవల ఓ వీడియో తీశారు. మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని అల్లు అర్జున్ ఆ వీడియోలో సూచించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో వారు బాధితులను పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి సాధారణ జీవనశైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారని, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలబడదామంటూ వీడియో తీశారు. ఈ వీడియో నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.