YS Bhaskar Reddy: వైఎస్ వివేకా హత్య కేసు... వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court notices to YS Bhaskar Reddy

  • వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డి
  • భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
  • బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో సీబీఐ పిటిషన్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. 

ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అనంతరం భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చికి వాయిదా వేసింది. వివేకా హత్య జరిగి ఐదేళ్లకు పైగా అయింది. సుదీర్ఘ కాలంగా ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అయినప్పటికీ కేసు విచారణ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. 

  • Loading...

More Telugu News