ఐదేళ్లు 'పుష్ప' సెట్ లోనే గడిచిపోయాయి: రష్మిక మందన్న భావోద్వేగం
- 'పుష్ప' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రష్మిక
- చివరి రోజున రోజంతా షూటింగ్ జరిగిందని వెల్లడి
- అల్లు అర్జున్ తో పాటు మొత్తం టీమ్ తో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడిందన్న రష్మిక
పుష్ప సినిమాకు సంబంధించి నాకు అదే చివరి రోజు అని తెలిసినప్పటికీ... నాకు అలా అనిపించలేదు. ఎందుకనేది ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా ఏడెనిమిదేళ్ల కెరీర్లో గత 5 ఏళ్లు దాదాపు ఈ సినిమా సెట్ లోనే గడిచిపోయాయి. ఇంకా పని మిగిలే ఉంది. పార్ట్-3 కూడా ఉంది.
ఏదో అర్థం కాని దుఃఖం. అన్ని భావోద్వేగాలు కలిసి వచ్చాయి. ఎంతో అలసిపోయాను. ఇదే సమయంలో ఎంతో గర్వంగా కూడా ఉంది. గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం, మనకు తెలియకుండానే వారితో అనుబంధం ఏర్పడటం క్రేజీగా ఉంది.
అల్లు అర్జున్, సుకుమార్ తో పాటు మొత్తం టీమ్ తో ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడింది. పుష్ప సెట్ నాకు హోమ్ గ్రౌండ్ అయింది. 2024 నవంబర్ 25వ తేదీ నాకు ఎంతో కష్టమైన రోజు. అయితే అది విలువైన రోజుగా ఉంటుందని ఆశిస్తున్నా" అని రష్మిక భావోద్వేగానికి గురయింది.