'గేమ్ ఛేంజర్' మూడో పాటపై కీలక అప్డేట్.. కొత్త పోస్టర్ అదుర్స్!
- రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో 'గేమ్ ఛేంజర్'
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- మూవీలోని మూడో పాట ఈ నెల 28న విడుదల
- కలర్ ఫుల్ పోస్టర్‌తో ప్రకటించిన మేకర్స్
తాజాగా 'గేమ్ ఛేంజర్' మూడో పాటపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్‌ను ఈ నెల 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇదొక లవ్ ట్రాక్ అని తెలుస్తోంది. హీరోహీరోయిన్ చెర్రీ, కియారా అద్వానీ కలర్ ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. పర్పుల్ కలర్ డ్రెస్‌లో ఇద్దరూ అదరగొట్టేశారు.
ఇక ఇప్పటివరకు 'గేమ్ ఛేంజర్' నుంచి వచ్చిన రెండు సాంగ్స్ 'జరగండి', 'రా మచ్చా'... మాస్ ఆడియన్స్ ని మెప్పించగా ఇప్పుడు మెలోడీ పాట ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలి.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాణంలో భారీగా ఈ సినిమా రూపొందింది. ఎస్ఎస్ థమన్ బాణీలు అందించిన గేమ్ ఛేంజర్‌లో ఇతర కీలక పాత్రల్లో అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్జే సూర్య తదితరులు నటించారు.