అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత
- డిసెంబర్ 5న విడుదలవుతున్న 'పుష్ప 2'
- బన్నీకి విషెస్ తెలిపిన శిల్పా రవి
- థ్యాంక్యూ సోమచ్ అని రిప్లై ఇచ్చిన బన్నీ
మరోవైపు సినిమా రిలీజ్ అవబోతున్న తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బన్నీ స్పందించారు. "థాంక్యూ సో మచ్" అని రిప్లై ఇచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. నంద్యాలలోని రవి ఇంటికి బన్నీ వెళ్లారు. ఆ పర్యటన వివాదాస్పదమయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు కూడా పెట్టారు.
మరోవైపు, 'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. జగపతి బాబు, అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.