'ఆహా' ఫ్లాట్ ఫామ్ పై రీసెంట్ మూవీ!
- అక్టోబర్ 25న విడుదలైన 'లగ్గం'
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
- కీలకమైన పాత్రను పోషించిన రాజేంద్ర ప్రసాద్
- ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. సాయిరోనక్ .. ప్రగ్యా నగ్రా హీరో - హీరోయిన్ గా నటించగా, రాజేంద్ర ప్రసాద్ .. రోహిణి .. ఎల్ బి శ్రీరామ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మణిశర్మ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.
చైతన్య హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. తన కూతురు మానసను చైతన్యకి ఇచ్చి వివాహం చేయాలని అతని మేనమామ అనుకుంటాడు. ఈ విషయాన్ని గురించి తన చెల్లెలితో మాట్లాడతాడు. ఆమె కూడా తన కొడుకును ఈ పెళ్లికి ఒప్పిస్తుంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సరిగ్గా ఆ సమయంలో ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి? దాని పర్యవసానాలు ఎలాంటివి? అనేది కథ.