షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై కంగనా రనౌత్ స్పందన
- రైటర్, డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న ఆర్యన్ ఖాన్
- ఆర్యన్ నిర్ణయాన్ని ప్రశంసించిన కంగనా రనౌత్
- ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
స్టార్ కిడ్స్ బరువు తగ్గడం, తమను తాము బొమ్మల్లా భావించడం, నటీనటులుగా మారడం సాధారణంగా జరిగే విషయమేనని కంగన అన్నారు. అయితే అంతకు మించి వెళ్లాలనుకోవడం చాలా గొప్ప విషయమని చెప్పారు. స్టార్ కుటుంబాలకు చెందిన పిల్లలు కష్టపడకుండా సులభమైన మార్గాన్ని ఎంచుకుని నటనలోకి వస్తుంటారని చెప్పారు. అలాకాకుండా డైరెక్షన్ వైపు ఆర్యన్ వెళ్లాలనుకోవడం గ్రేట్ అని అన్నారు. రైటర్, దర్శకుడిగా ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు.