పుష్ప-2 ట్రైలర్‌పై దర్శకుడు రాజమౌళి స్పందన ఇదే
- పుష్ప2 ట్రైలర్‌పై జక్కన ప్రశంసలు
- పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైందని వ్యాఖ్య
- దేశమంతా విస్తరించి డిసెంబర్ 5న పేలుతుందంటూ ట్వీట్
అభిమానులను ఉర్రూతలూగిస్తున్న పుష్ప-2 ట్రైలర్‌పై దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందించారు. ‘‘పాట్నాలో వైల్డ్ ఫైర్ మొదలైంది!! దేశమంతటా విస్తరిస్తోంది!! డిసెంబర్ 5న పేలుతుంది!! పార్టీ కోసం వేచిచూడలేను పుష్ప!!’’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కాగా పుష్ప2 ట్రైలర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా... ఇంటర్నేషనలు...!’, ‘పుష్ప అంటే ఫైరు కాదు.... వైల్డ్ ఫైరు’ వంటి డైలాగులతో పాటు ఇతర పంచ్ డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక 2021 చివర్లో వచ్చి దుమ్మురేపిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తున్న విషయం తెలిసిందే.