జగన్ అసెంబ్లీకి రావాలంటే ఒక చిట్కా ఉంది: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- జగన్ ను చూసి చాలా రోజులు అయిందన్న కోటంరెడ్డి
- మాట్లాడేందుకు ప్రతిరోజు గంట సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తారని వ్యాఖ్య
- ఆయన ఏం మాట్లాడినా ఎవరూ అడ్డు రాకూడదన్న కోటంరెడ్డి
2017లో ఆయన పాదయాత్రకు వెళ్తున్న సమయంలో పార్టీ బాధ్యతలను బుగ్గనకు కానీ, మరెవరికైనా కానీ ఇచ్చి వెళ్లాల్సిందని... కానీ ఆయన అలా చేయలేదని... ఎందుకంటే ఆయన మినహా మరెవరూ మాట్లాడటం ఆయనకు ఇష్టం ఉండదని కోటంరెడ్డి అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ సమస్యల కోసం పోరాడలేదని విమర్శించారు. అసెంబ్లీలో మైక్ కోసం పోరాడాలని మాకు చెప్పేవారని అన్నారు. గతంలో కోటంరెడ్డి వైసీపీలో ఉన్న సంగతి తెలిసిందే.