బీజేపీ నేత, సినీ నటి నవనీత్ రాణాపై దాడికి యత్నం
- మహారాష్ట్రలో దరియాపూర్ నియోజకవర్గంలో నవనీత్ ప్రచారం
- నవనీత్ పై కుర్చీలు విసిరేందుకు యత్నించిన కొందరు వ్యక్తులు
- తన గన్ మన్లు తనను కాపాడారన్న నవనీత్
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఖల్లార్ లో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన అనంతరం వేదికపై నుంచి కిందకు రాగానే తనపై కుర్చీలు విసిరేందుకు కొందరు యత్నించారని మండిపడ్డారు. ప్రచారసభ జరుగుతుండగా కొందరు అరుస్తూ గందరగోళం సృష్టించారని తెలిపారు. వారంతా ఒక మతానికి సంబంధించిన నినాదాలు చేశారని దుయ్యబట్టారు. తనను దూషించారని, కొందరు తనపై ఉమ్మివేశారని తెలిపారు. తన గన్ మన్లు తనను కాపాడి అక్కడి నుంచి తీసుకువచ్చారని చెప్పారు.