కిషన్ రెడ్డిపై పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు
- కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయ్యాడని తీవ్రవ్యాఖ్య
- కలెక్టర్ మీద దాడిని సమర్థించడమేమిటని ఆగ్రహం
- మూసీ వద్ద రేపు నిద్రలేచాక నిజాలు చెప్పాలన్న మంత్రి
కలెక్టర్‌పై దాడి ఘటనను సమర్థించడమేమిటని ప్రశ్నించారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో ఈరోజు బీజేపీ చేస్తున్న 'మూసీ నిద్ర'పైనా పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ నేతలు మూసీ వద్ద రేపు నిద్రలేచిన తర్వాత అక్కడి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర నుంచి లేవాలన్నారు.
నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాల్వ వాసన చూసిన తర్వాత అయినా వారు దైవసాక్షిగా నిజాలు చెబుతారని భావిస్తున్నానన్నారు.