ఊహించని మలుపులతో సాగే ఉత్కంఠభరిత సిరీస్... 'వికటకవి'
- యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ గా 'వికటకవి'
- ప్రధాన పాత్రల్లో నరేశ్ అగస్త్య - మేఘ ఆకాశ్
- 1940 - 70లలో నడిచే కథ
- ఈ నెల 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ కథ 1940లలో... 1970లలో నడుస్తుంది. ఆ కాలాలకి సంబంధించిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఈ కథను నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఆ కాలాలకు సంబంధించిన సామాజిక జీవన విధానాన్ని చూపించడానికి ఎంతో కసరత్తు చేయవలసి ఉంటుంది. అలాంటి ఒక కష్టతరమైన కంటెంట్ తో నిర్మితమైన ఈ సిరీస్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
1940లలో 'అమరగిరి' ప్రాంతంలో ఒక మరిచిపోలేని సంఘటన జరుగుతుంది. 1970లలో అదే సంఘటన మళ్లీ జరుగుతుంది. దాంతో అందుకు కారణం తమ గ్రామదేవతకి కోపం రావడమేనని అక్కడి వాళ్లంతా భావిస్తారు. ఈ విషయాన్ని ఛేదించడానికి డిటెక్టివ్ 'వికటకవి' రంగంలోకి దిగుతాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ.