ఫిఫ్టీ కొట్టిన 'దేవర'
- ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర
- సెప్టెంబర్ 27న రిలీజైన దేవర
- థియేటర్‌లలో 50 రోజులు పూర్తి చేసుకున్న దేవర
ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవర సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు నెలకొల్పింది. దీంతో 52 కేంద్రాల్లో ఈ మూవీ 50 రోజులు ప్రదర్శితమైందని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ విడుదల చేసింది. ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లలో దేవర మూవీ 50 రోజులు పూర్తి చేయడం విశేషంగా పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 27న బాక్సాఫీసు ముందుకొచ్చిన దేవర ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.